ఘనంగా ప్రియాంక పుట్టిరోజు.. సక్సెస్‌ గురించి మాధవన్‌..

21 November 2023

నవంబర్ 20న (సోమవారం) ఘనంగా తన పుట్టిరోజు వేడుకలు జరుపుకుంది టోలీవుడ్ వయ్యారి భామ ప్రియాంక అరుళ్ మోహన్.

తెలుగులో గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఓజి, సరిపోదా శనివారం చిత్రాల్లో నటిస్తుంది.

హీరోయిన్‌ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ పుట్టినరోజు సందర్భంగా విషెస్‌ తెలిపాయి ఓజీ, సరిపోదా శనివారం యూనిట్‌లు.

ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్లకు నెట్టింట్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఓజీలో పవన్‌ కల్యాణ్‌, సరిపోదా శనివారంలో నాని హీరోలుగా నటిస్తున్నారు.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సక్సెస్‌, నటన గురించి కొన్ని విషయాలు తెలిపారు కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్.

తాను ఏ పాత్రలో నటించినా, పాత్రకు ప్రాణం పోయడానికి వంద శాతం ప్రయత్నిస్తానని అన్నారు తమిళ నటుడు మాధవన్‌.

కొన్ని సందర్భాల్లో సునాయాసంగా నటించిన చిత్రాలు పెద్ద విజయం సాధించాయని అన్నారు కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్‌.

అలాంటివాటిని గమనించినప్పుడు, ఆ సక్సెస్‌లకు తాను అనర్హుడినని అనిపిస్తుందని చెప్పారు స్టార్ హీరో మాధవన్‌.