నా దుస్తులు విప్పమంటూ చీప్ గా మాట్లాడాడు: ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు, బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది.
మ్యాగజైన్కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది.
2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది.
ప్రియాంక మాట్లాడుతూ.. "అప్పుడప్పుడే బాలీవుడ్లోకి అడుగుపెట్టాను.
నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది.
అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు.
నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా.
ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు." అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది.
దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి