24 August 2025
వయసు 43 ఏళ్లు.. ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల రెమ్యునరేషన్.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం హీరోలకు సమానంగా హీరోయిన్లు సైతం పారితోషికం తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ హీరోయిన్ ఒక్కో సినిమాకు 40 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఆమె వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు. ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది.
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోయిన్ ఆమె. ఈ ముద్దుగుమ్మకు అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె మరెవరో కాదండి.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
గతంలో సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఆమె ఏకంగా రూ.41 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
నివేదికల ప్రకారం ప్రియాంక ఆస్తులు ఇప్పటివరకు రూ.700 కోట్లు ఉన్నట్లు సమాచారం. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆమె భర్త ఆస్తులు రూ.666 కోట్లు వరకు ఉంటుందని అంచనా. వీరిద్దరి ఆస్తులు కలుపుకుని మొత్తం రూ.1300 కోట్లు వరకు ఉంటాయని సమాచారం.
ప్రస్తుతం ఈ అమ్మడు SSMB 29 చిత్రీకరణలో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్