TV9 Telugu
03 February 2024
165 కోట్ల నష్టం.! తెగ ఫీల్ అవుతున్న ప్రియాంక చోప్రా.!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే.
అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2019లో వివాహం చేసుకున్న తర్వాత యూఎస్‌కు మకాం మార్చింది ప్రియాంక.
వీరు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు.
కానీ ఇప్పుడు ఉన్నట్లు ఈ జంట తమ ఇంటి నుంచి బయటకు వచ్చారని సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆ ఇంట్లో ప్రియాంక, నిక్ దంపతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారట. నివసిస్తున్న ఇళ్లు డ్యామేజ్ అయ్యిందట.
అనేక చోట్ల నీళ్లు లీక్ అవుతుండడంతో ఇంట్లో అనేక ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయని సమాచారం.
అయితే ఇప్పుడు వీరిద్దరు తమ కూతురితోపాటు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి తాత్కలికంగా మరో ఇంట్లో ఉంటున్నారట.
ప్రస్తుతం ధరల ప్రకారం ఇంటి విలువ 165 కోట్లు. ఇక ఈ ఇంటిని మరమ్మత్తు చేయడానికి 2.5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి