కలువరేకులు ఈ వయ్యారి కన్నులు.. పున్నమి చందమామ ఈమె మోము..
TV9 Telugu
22 April 2024
20 నవంబర్ 1994న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది అందాల తార ప్రియాంక మోహన్.
ఈ ముద్దుగుమ్మ తండ్రి అరుల్ మోహన్ తమిళంకి చెందిన ఓ వ్యాపారవేత్త. కన్నడకి చెందిన తల్లి కృష్ణ మోహన్ గృహిణిగా ఉన్నారు.
దక్షణ కన్నడ జిల్లాలోని మూడబిద్రిలో ఉన్న అల్వాస్ పియు కళాశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ వయ్యారి భామ.
ఈ వయ్యారి ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలదు.
సినిమాల్లో కథానాయకిగా నటించడానికి ముందు కొన్ని థియేట్రికల్ ప్రొడక్షన్స్‌లో తన కెరీర్ స్టార్ట్ చేసింది.
2019లో కన్నడ చిత్రం ‘ఓంధ్ కథే హెల్లా’తో చలనచిత్ర ఓ కీలక పాత్రలో నటించి అరంగేట్రం చేసింది ఈ అందాల దేవత.
తర్వాత అదే ఏడాది నాచురల్ స్టార్ నానికి జోడిగా గ్యాంగ్ లీడర్ సినిమాతో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది.
2022లో శ్రీకారంలో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఓజి, సరిపోదా శనివారం అనే తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి