పవన్ కళ్యాణ్ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ప్రియాంక 

Rajeev 

10 June 2024

నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ప్రియాంక మోహన్.

అందమైన రూపం.. ఆకట్టుకునే మోముతో కుర్రాళ్లను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. 

ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. 

ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.అక్కడ వరుసగా హిట్స్ అందుకుంది ప్రియాంక. 

డాన్, డాక్టర్ వరుణ్ లాంటి సినిమాలు చేసి మెప్పించింది. అలాగే స్టార్ హీరో సూర్య సినిమాలోనూ నటించింది. 

ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. 

పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.