ప్రియమణి గ్రీన్ సిగ్నల్.. ఎన్టీఆర్ పుట్టినరోజున..!
TV9 Telugu
11 April 2024
షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటించే అవకాశం వస్తే మరోసారి నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు నటి ప్రియమణి.
అజయ్ దేవ్‌గణ్ నటించిన మైదాన్‌లో కీలక పాత్రలో నటించారు ప్రియమణి. మైదాన్‌లో తన పాత్ర ఆకట్టుకుంటుందని అన్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు రావడం ఆనందంగా ఉందని చెప్పారు ఈ బ్యూటీ.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమా ఏపీ, తెలంగాణ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ ఎల్ పీ దక్కించుకుందని చెప్పారు మేకర్స్.
టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన సినిమా ఆది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన ఆది... మళ్లీ సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయమని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి