10 April 2024
స్టార్ హీరోలకు జోడిగా నటించని ప్రియమణి.. కారణం అదేనట..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ప్రియమణి. ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోలకు జోడిగా కనిపించలేదు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించలేదు. ఇన్నేళ్ల కెరీర్లో హీరోలతో నటించకపోవడానికి గల కారణం పై తొలిసారి రియాక్ట్ అయ్యింది.
మైదాన్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోంది. అందులోనూ ఇదే ప్రశ్న ఎదురు కావడంతో ప్రియమణి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
టాప్ లిస్టులో ఉండే హీరోలకు జోడిగా తనను ఎందుకు తీసుకోరనే విషయం తనకు ఇప్పటికీ అర్థం కాదని.. అందుకు సమాధానం తన దగ్గర లేదని తెలిపింది.
ఇందుకు కారణమేంటీ అనేది దర్శకనిర్మాతలే చెప్పాలని.. తను ఈ విషంయలో ఏ వ్యక్తిని నిందించాలనుకోవడం లేదని.. కానీ చాలామంది అడిగారని తెలిపింది.
టాప్ హీరోల సినిమాల్లో నటించకూడదని చాలా మంది కోరుకున్నారని.. ఎందుకంటే వారి పాత్రలను తాను డామినేట్ చేస్తానని తనతో కొందరు చెప్పారంది.
అందుకే స్టార్ హీరోకు జోడీగా లేదా వారి సినిమాల్లో తనను తీసుకోలేదని.. అందుకు ఆసక్తి కూడా మేకర్స్ చూపించరంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం తాను చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నానని.. కానీ నెంబర్ 1 హీరోలతో నటించలేదని కొన్నిసార్లు బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది ప్రియమణి.
ఇక్కడ క్లిక్ చేయండి.