వయసు పెరిగినా వన్నెతగ్గని అందంతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న  ప్రియమణి..

07 October 2023

2003లో ఎవరే అతగాడు చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అందాల భామ ప్రియమణి. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్ ఈమె పూర్తి పేరు. 4 జూన్ 1984లో కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించింది ఈ బ్యూటీ.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ. తన నటనకు ఎన్నో అవార్డ్స్ కూడా పొందింది.

తెలుగులో పెళ్ళైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, కింగ్, శంభో శివ శంభో, గోలిమార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది ఈ భామ.

2019లో ది ఫ్యామిలీ మ్యాన్ అనే అమెజాన్ ప్రైమ్ సిరీస్ తో ఓటీటీలో కూడా అడుగుపెట్టింది ఈ అందాల తార. మరో రెండు వెబ్ సిరీస్ లలో కూడా కనిపించింది.

2021లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన వెంకటేష్ నారప్ప చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

2022లో భామాకలాపం అనే చిత్రంతో ఆహా వేదికగా మరోసారి డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ కూడా వస్తుంది.

తర్వాత కొన్ని టెలివిజన్ షోస్ లో కూడా జడ్జ్ గా వ్యవహరించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది.