అందామనే అమృతంతో ఆ బ్రహ్మ ఈ వయ్యారికి ప్రాణం పోసాడేమో..
TV9 Telugu
25 March 2024
4 జూన్ 1984న కర్ణాటక రాజధాని బెంగళూరులోని పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది అందాల తార ప్రియామణి.
ఈ వయ్యారి పూర్తి పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యర్. దీంతో పాటు ప్రియా మణి రాజ్ అనే మరో పేరు కూడా ఉంది.
ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు వాసుదేవన్ మణి అయ్యర్. అయన మొక్కల వ్యాపారం చేస్తున్నారు. సొంతంగా ఒక నర్సరీ ఉంది.
ఆమె తల్లి మాజీ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి లతామణి అయ్యర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్.
ఈ బ్యూటీ కర్నాటక గాయకుడు కమలా కైలాస్ మనవరాలు. సినీ నటి విద్యాబాలన్ కోడలు. అలాగే నేపథ్య గాయని మాల్గుడి శుభ మేనకోడలు.
చదువుకునే రోజుల్లో కాంచీపురం సిల్క్, ఈరోడ్ భరణి సిల్క్స్, లక్ష్మి సిల్క్స్‌లకు మోడల్‌గా నటించింది ఈ బ్యూటీ.
ప్రియమణి 12వ తరగతి చదువుతున్నప్పుడు తమిళ దర్శకుడు భారతీరాజా ఆమెను కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
ఈమె కరస్పాండెన్స్ ద్వారా సైకాలజీలో బీఏ డిగ్రీ చేసింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడగలదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి