ఏనుగును బహుకరించిన ప
్రియమణి
TV9 Telugu
21 March 2024
భామాకలాపం రెండు పార్టులూ హిట్ కావడమే కాదు, నార్త్ లోనూ వరుస సక్సెస్‌లతో క్లౌడ్‌నైన్‌లో ఉన్నారు హీరోయిన్ ప్రియమణి.
అదే ఆనందంతో త్రిక్కయిల్ మహదేవ టెంపుల్‌కి ఓ ఏనుగును బహుకరించారు ప్రియమణి. అయితే అది మామూలు ఏనుగు కాదు.
మెకానికల్ ఏనుగు. ఈ ఏనుగుకు మహదేవన్ అనే పేరు పెట్టారు. ఈ తరహా ఏనుగును కేరళలో ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.
మేళతాళాలతో ఈ ఏనుగును గుడిలోకి ఆహ్వానించారు. జంతువులకు హాని కలిగించకుండా ఉండటానికి ఎన్ని మార్గాలున్నా, వాటిని అన్వేషిస్తానని అంటున్నారు ప్రియమణి.
మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే, జంతువులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు.
కర్ణాటకకు చెందిన నటి ప్రియమణి జంతు ప్రేమికురాలు. సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడు జంతు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది.
'ఇంతకు ముందు త్రిస్సూర్‌లోని శ్రీ కృష్ణ ఆలయంలో ఇలాంటి ఏనుగునే ఏర్పాటు చేశారని తెలుసుకున్నాను. అనుసరించాలనిపించింది. అయ్యాను' అని చెప్పారు ప్రియమణి.
ఇక్కడ క్లిక్ చేయండి