TV9 Telugu
జర్మన్ లగ్జరీ కారు కొన్న బిజీ యాక్టర్ ప్రియమణి.. ధర ఎంతంటే.?
టాలీవుడ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎవరే అతగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి.
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ స్టార్ డమ్ అందుకుంది ఈ అమ్మడు.
పెళ్లి తర్వాత ఇండస్ట్రీకిలో కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది.
థియేటర్లలో, ఓటీటీలలో వరుస సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా బిజీగా ఉంటుంది అనే చెప్పాలి ఈ అమ్మడు.
ఇటీవల భామాకలాపం 2 వెబ్ సిరీస్‌తో మంచి హిట్ అందుకుంది. అండ్ ప్రియా నటించిన ఆర్టికల్ 370 మూవీ విజయవంతంగా రన్ అవుతుంది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ప్రియమణి.. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.
జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది ప్రియమణి. ఈ కారు ధర దాదాపు రూ. 74 లక్షల వరకు ఉంటుంది.
హీరోయిన్ ప్రియమణి కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈ అమ్మడి అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యార్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి