TV9 Telugu
ఆహాలో సత్తా సాటుతున్న భామాకలాపం 2.. ఆకట్టుకుంటున్న గామి టీజర్..
20 Febraury 2024
ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'భామాకలాపం'. 2022లో విడుదలైన ఈ చిత్రానికి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ సినిమాకు సీక్వెల్‌గా భామాకలాపం 2 'ఆహా'లో విడుదలైన ఒక్కరోజులోనే 50 మిలియన్ మినిట్స్ వ్యూస్ అందుకుని రికార్డ్ సృష్టించింది.
ఓటీటీలో వచ్చిన వచ్చిన దీనికి అద్భుతమైన స్పందన రావడంతో ఆనందంగా ఉన్నారు ఈ సినిమాను రూపొందించిన దర్శక నిర్మాతలు.
గౌతమ్ సాగి, దీప్షిఖా జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో వస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా రవికుల రఘురామా.
ఈ చిత్రం నుంచి చందమామే అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేసారు మేకర్స్.
విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ తెరకెక్కిస్తున్న తెలుగు సినిమా ‘గామి’. చాందిని చౌదరి ఇందులో హీరోయిన్.
క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ అడ్వెంచర్ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాతగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గామి మేకింగ్ వీడియో విడుదల చేసారు. తాజాగా టీజర్ విడుదల చేసారు. మార్చ్ 8న విడుదల కానుంది గామి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి