TV9 Telugu

19 February 2024

దిమ్మతిరిగే వ్యూస్ తో ఓటీటీ లో దూసుకుపోతున్న భామాకలాపం 2.

ప్రియమణి ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ భామా కలాపం. ఫ్యామిలీ స్టోరీకి కాస్త థ్రిల్లర్‌ టచ్‌ వల్ల సూపర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడిదే సినిమాకు సీక్వెల్‌ వచ్చింది.. భామాకలాపం 2 పేరుతో ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ హీస్ట్‌ థ్రిల్లర్‌ భామాకలాపం 2 మూవీలో ప్రియమణితో పాటు ఫిదా ఫేమ్‌ శరణ్య ప్రదీప్‌ కీలక పాత్ర పోషించింది.

మొదటి భాగం కంటే రెండో పార్ట్‌కు సూపర్ రెస్పాన్స్‌వస్తోంది. ఇదే విషయాన్ని ఆహా ఓటీటీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

భామాకలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు స్ట్రీమింగ్‌ మినిట్స్ దాటాయి’ అని తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్‌ చేసింది.

అలాగే ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. డేంజరస్ హౌస్‌ వైఫ్ రూల్ కొనసాగుతుందని అందులో పేర్కొంది.

భామకలాపం సినిమాలో సీరత్‌ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

అనుపమ అనే గృహిణీ పాత్రలో ప్రియమణి అభినయం అదిరిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే శరణ్య మరోసారి ఆకట్టుకుంది.