భామా కలాపం టీజర్.. అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రీ రిలీజ్..

TV9 Telugu

01 February  2024

2022లో నేరుగా ఆహా ప్లాట్‍ఫామ్‍లోకి విడుదలై విజయం సాధించింది ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా భామాకలాపం.

తాజాగా భామాకలాపం చిత్రానికి సీక్వెల్‍ను భామాకలాపం 2 సినిమా తీసుకొస్తున్నారు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ టీం.

తాజాగా భామాకలాపం 2 టీజర్ వచ్చింది. ఈ టీజర్ ఆకట్టుకొనేలా ఉంది. ఇందులో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుంది.

ఫిబ్రవరి 16 నుంచి భామాకలాపం 2 సినిమా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

సుహాస్, శివానీ జంటగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.

ఫిబ్రవరి 2 (శుక్రవారం)న అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రం తెలుగు చలనచిత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైటెక్ సిటీలోని ఆవాస హోటల్‌లో జరిగింది. దీనికి అల్లు అరవింద్, అడవి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి హిట్స్ తర్వాత సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. చూస్తుంటే ఈ సినిమా కూడా హిట్ అయ్యేలా కనిపిస్తుంది.