బ్యాడ్‌ లక్‌ అంటే.. పాపం... ఈ టాలీవుడ్ యాక్టర్‌దే...

07 December 2023

కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ ప్రియదర్శి.. ఇండస్ట్రీలో తన కెరీర్‌ను బానే స్టార్ట్ చేశాడు.

వరుస సినిమాలు చేస్తూ... స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల హీరోగా కూడా.. సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు.

ఇక ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ మా ఊరి పొలిమేర సినిమాలో కూడా నటించే ఛాన్స్ వచ్చేలా చేసుకున్నాడట ఈ స్టార్ యాక్టర్.

మా ఊరి పొలిమేర కథలో హీరో చేతబడి చేసే వ్యక్తి కావడంతో... ఈ సినిమాకు నో అన్నాడట స్టార్ యాక్టర్ ప్రియ దర్శి.

అలా బ్లాక్ బస్టర్ మా ఊరి పొలిమేర సినిమాను పక్కకు పెట్టేసి.. వేరే సినిమాలు చేసుకుంటూ వెళ్లాడట ప్రియా దర్శి.

కానీ కట్ చేస్తే.. ఓటీటీలో రిలీజ్‌ అయిన పొలిమేర సినిమా హిట్టవ్వడం.. ప్రేక్షకులను మెప్పించడం జరిగింది.

దానికి కంటిన్యూగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా సెన్సేషనల్ హీట్ అయింది. దీంతో పొలిమేర 3 కూడా రానుంది.

ఈ సినిమాతో సత్యం రాజేష్‌ ఇండస్ట్రీలోకి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇన్నాళ్లు రానీ ఫేం వచ్చేలా చేసుకున్నాడు.