TV9 Telugu
ఇంద్రగంటితో ప్రియదర్శి మూవీ.. క్రేజీ ప్రొజెక్ట్ లో విక్కీ కౌశల్..
03 March 2024
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచి చాటుకున్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.
ఈ మధ్యే లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా వచ్చిన ‘800’కి సమర్పకులుగా వ్యవహరించారు ఆయన.
ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.
విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న సినిమా కలియుగం పట్టణంలో. ఈ సినిమాకు రమాకాంత్ రెడ్డి దర్శకుడు.
విభిన్నమైన కథాంశంతో వస్తుంది కలియుగ పట్టణంలో. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో విక్కీ కౌశల్ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఓ క్రేజీ ప్రొజెక్ట్ లో భాగం అయ్యారు.
త్వరలోనే ఈయన ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్రలో నటించబోతున్నారు. ఇది హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ.
ఈ కారెక్టర్ కోసం ప్రత్యేకంగా 25 కిలోలు బరువు పెరుగుతున్నారు విక్కీ కౌశల్. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి