ప్రియదర్శి, నభా నటేష్ జంటగా..
TV9 Telugu
21 April 2024
ప్రియదర్శి హీరోగా నభా నటేష్ కథానాయకిగా హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'డార్లింగ్'.
వై దిస్ కొలవరి అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఇందులో హీరోయిన్ రీతూ వర్మ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి వివేక్ సాగర్ స్వరాలూ సమకూరుస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి చిత్ర యూనిట్ అంతా కూడా హాజరయ్యారు.
టైటిల్‌తో పాటు 'డార్లింగ్' టీజర్ కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంది.
డార్లింగ్ అనే పదమే ఓ ట్రేడ్ మార్క్.. ఇండియన్ సూపర్ హీరో ప్రభాస్ అన్న అందరినీ పిలిచే పేరన్నారు ప్రియాదర్శి.
ఈ డార్లింగ్‌ను టైటిల్‌గా పెట్టుకోవాలంటే ముందు చాలా భయపడ్డామని మూవీ ఈవెంట్ లో ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.
చాన్నాళ్ల గ్యాప్ తర్వాత నాభ నటేష్ నటిస్తున్న చిత్రమిది. మూవీ ప్రకటన ముందు డార్లింగ్ డైలాగ్స్ తో నాభ వీడియో బాగా ట్రెండ్ అయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి