వైట్ డ్రెస్ లో స్వర్గం వీడి వచ్చిన దేవకన్యలా మెరుస్తున్న ప్రియా..

TV9 Telugu

05 January 2024

28 అక్టోబర్ 1999న కేరళ రాష్ట్రంలోని పున్‌కున్నం అనే ఊరిలో జన్మించింది అందాల తార ప్రియా ప్రకాష్ వారియర్.

ఈ వయ్యారి తండ్రి ప్రకాష్ వారియర్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు, తల్లి ప్రీత గృహిణి.

కేరళలోని త్రిస్సూర్‌లో సందీపని విద్యా నికేతన్‌లోని పాఠశాలలో తన స్కూలింగ్ పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

కేరళలోని త్రిస్సూర్‌లో విమలా కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

2019లో మలయాళీ రొమాంటిక్ చిత్రం ఓరు అదార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) అనే చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది.

2021లో నితిన్ సరసన చెక్ అనే ప్రిజన్ డ్రామా చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రం డిజాస్టర్ అయింది.

తర్వాత యంగ్ హీరో తేజ సజ్జకి జోడిగా ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ అనే తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో నటించింది.

2023లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలిగా కనిపించింది.