18 October 2024
పెద్ద హీరోతో కలిసి 55 రోజులు నటిస్తే.. చివరకు.. ప్రియా భవానీ..
Rajitha Chanti
Pic credit - Instagram
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.
ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతోపాటు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బ్యూటీ.
ఓ పెద్ద హీరో సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఈ చెన్నై బ్యూటీ పంచుకుంది. ఆ మూవీ గురించి అసలు విషయం చెప్పేసింది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తమిళంలో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి అలా నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆఫర్స్ అందుకుంది.
ఓ స్టార్ హీరో సరసన తనకు నటించే ఛాన్స్ వచ్చిందని.. దీంతో ఎంతో ఇష్టపడి ఆ సినిమాలో దాదాపు 55 రోజులపాటు షూటింగ్ చేసినట్లు గుర్తుచేసుకుంది.
షూటింగ్ పూర్తైన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వెళ్లగా షాక్ అయ్యానని.. ఆ సినిమాలో తన పాత్ర కేవలం 5 నిమిషాల కంటే తక్కువగా ఉందని చెప్పుకొచ్చింది.
షూటింగ్ అంతా ఏమైందని ఆ సినిమాదర్శకుడిని అడిగితే అదంతా మ్యూజిక్‌లో వస్తుందని చెప్పాడని.. ఆ హీరోకు కాల్ చేసి విషయం చెప్పానని అన్నారు.
తానూ 135 రోజులు షూటింగ్ చేశానని.. తన సన్నివేశాలే లేవని ఆ హీరో తనకు చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే ఏ సినిమా , ఏ హీరో అనేది చెప్పలేదు.
ఇక్కడ క్లిక్ చేయండి.