ఆ బ్రహ్మ ఈమెను పాలతో మలచి తేనెతో ప్రాణం పోసాడేమో..

19 December 2023

TV9 Telugu

31 డిసెంబర్ 1989న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది అందాల భామ ప్రియా భవాని శంకర్. పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్.

తమిళనాడులోని చెన్నైలో SBOA మెట్రిక్యులేషన్ మరియు హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది.

తమిళనాడులోని వండలూర్ లో B.S. అబ్దుర్ రెహమాన్ క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీలో బీటెక్ ,ఎంబీఏ చదువుకుంది.

ఈ బ్యూటీ తండ్రి పేరు భవానీ శంకర్. ఆయన స్టేట్ అఫ్ ఇండియాలో పని చేస్తున్నారు. తల్లి తంగం భవానీ శంకర్ గృహిణి.

తమిళ న్యూస్ ఛానెల్ పుతియా తలైమురైలో టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టింది ఈ వయ్యారి.

స్టార్ విజయ్ టెలివిజన్ లో ప్రసారమైన కళ్యాణం ముదల్ కాదల్ వరైలో సీరియల్ నటిగా కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ.

2017లో తమిళ చిత్రం మేయాధా మాన్ తో సినీ అరంగేట్రం చేసింది. తర్వాత చాల తమిళ చిత్రాల్లో ఆకట్టుకుంది ఈ భామ.

2023లో కళ్యాణం కమనీయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత ధూత అనే తెలుగు వెబ్ సిరీస్ తో మెప్పించింది.