వాట్‌... చిరు ఆఫర్‌ని కాదన్నారా?

TV9 Telugu

21 March 2024

వాట్‌... చిరు ఆఫర్‌ని కాదన్నారా కన్నడ స్టార్ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్‌! అదీ, ఒకసారి కాదా, రెండు సార్లా?

ఎందుకు కాదనాల్సి వచ్చింది? అంత పెద్ద మెగాస్టార్‌కి నో చెబుతున్నప్పుడు ఎవరైనా ఒకటికి రెండు మాటలు కల్పించి అయినా చెబుతారు.

కానీ, పృథ్విరాజ్‌ ఈ విషయంలోనూ లౌక్యం ప్రదర్శించలేదు. రెండు సార్లూ ఒకటే మాట చెప్పారు. దాని పేరు ఆడుజీవితం.

యస్‌.. మెగాస్టార్‌ చిరంజీవి సైరా సినిమా చేస్తున్నప్పుడు ఓ కీ రోల్‌ కోసం పృథ్విరాజ్‌ని సంప్రదించారట మేకర్స్.

అయితే అప్పుడు ఆడుజీవితానికి తన ఫుల్‌ కాల్షీట్‌ కేటాయించానని ఆ మూవీ యూనిట్ తో అన్నారట దేవా స్నేహితుడు.

మళ్లీ, లూసిఫర్‌ రీమేక్ గ వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కోసం సంప్రదించినప్పుడు కూడా సేమ్‌ మాటలే చెప్పారట ఆయన.

ఒకటికి, రెండు సార్లు మెగాబాస్‌తో పనిచేసే అవకాశాన్ని అలా పోగొట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు పృథ్విరాజ్‌.

తాజాగా ఆడుజీవితం ప్రమోషన్స్ ఈ విషయాన్ని తెలిపారు ఆయన. త్వరలోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ కి వెళ్లనున్నారు.