వామ్మో... 31 కిలోలు తగ్గారా?
TV9 Telugu
29 March 2024
సినిమాల మీద ఉన్న ప్రేమతో కొన్నిసార్లు మూవీ ఆర్టిస్టులు బరువు పెరగడం, తగ్గడం చాల సార్లు చూస్తూనే ఉంటాం.
సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పుడిప్పుడు ఎదో విధంగా కష్టపడి వర్కౌట్స్, డైట్ చేస్తూ బరువు తగ్గి కాస్త నాజూగ్గా మారుతున్నారు జేజమ్మ.
ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కళ్ల ముందు ఎన్ని ఉన్నా, బరువు విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదు ఆర్టిస్టులు.
లేటెస్ట్ గా తన వెయిట్ విషయంలో ఓ ప్రయోగం చేశారు మలయాళీ స్టార్ నటుడు, దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్.
తాను హీరోగా నటించిన ఆడు జీవితం అనే సినిమా కోసం దాదాపు 31 కిలోలు తగ్గారట దేవా స్నేహితుడు వరదరాజ మన్నార్.
దీనికోసం జిమ్ ట్రైనర్, న్యూట్రీషియన్, డాక్టర్స్ పర్యవేక్షణలోనే తగ్గినట్టు చెప్పారు పృథ్విరాజ్ సుకుమారన్.
ఈ సినిమా కోసం ఒక్కోసారి 72 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు హీరో పృథ్వి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి