ప్రభాస్‌ను డార్లింగ్ అని ఎందుకంటారో అర్ధమైంది: ప్రృథ్విరాజ్‌.

17 December 2023

ప్రస్తుతం దేశమంతా సలార్‌ ఫీవర్‌ నడుస్తోంది. సలార్‌ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది.

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా నటించడం, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలై ట్రైలర్‌తో పాటు లిరికల్ సాంగ్స్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

సలార్‌ లో ప్రభాస్‌తో పాటు మలయాళ స్టార్‌ హీరో ప్రృథ్విరాజ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు..

తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో ఓ ఇంటర్వ్యూలో ప్రృథ్విరాజ్‌ ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్‌ ఇండస్ట్రీలో చాలా మంది డార్లింగ్‌ అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఇదే విషయమై ప్రృథ్వీరాజ్‌ స్పందించారు. 

"ప్రభాస్‌ను డార్లింగ్‌ అని ఎందుకు పిలుస్తారో నాకు సలార్‌ సమయంలో అర్థమైంది.

ప్రభాస్‌కు చాలా త్వరగా ఫ్రెండ్‌గా మారిపోయాను. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే గిఫ్ట్ ప్రభాస్‌కు ఉంది.

ప్రభాస్‌కు చాలా త్వరగా ఫ్రెండ్‌గా మారిపోయాను. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే గిఫ్ట్ ప్రభాస్‌కు ఉంది.

సెట్‍లో ఎప్పుడూ అందరి గురించి ప్రభాస్‌ చూసుకుంటారు. అందరూ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటుంటారు. 

అప్పుడు అర్థమైంది ప్రభాస్‌ను డార్లింగ్‌ అని పిలిచేది ఇందుకేనా అని" అని చెప్పుకొచ్చారు.