TV9 Telugu
డియర్ ఉమకు ప్రేమతో.. ఆహాలో భామా కలాపం 2 స్ట్రీమింగ్..
17 Febraury 2024
‘దియా’ సినిమా ఫేమ్ పృథ్వీ అంబర్, తెలుగమ్మాయి సుమయ రెడ్డి జంటగా నటిస్తున్న తెలుగు ప్రేమ కథ చిత్రం డియర్ ఉమ.
సాయి రాజేష్ మహదేవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో అజయ్ గోష్, సప్తగిరి, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు.
మూవీ హీరోయిన్ సుమయ రెడ్డినే ఈ సినిమాకు కథ అందిస్తూ సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు కూడా.
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా రొమాంటిక్ ఎంటర్టైనర్ డియర్ ఉమ సినిమా టీజర్ విడుదల చేసారు మూవీ మేకర్స్.
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ సినిమా భామా కలాపం2. భామా కలాపంకి సీక్వెల్ గా వస్తున్న చిత్రమిది.
ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, కమెడియన్ బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు.
ఈ నెల 16న ప్రముఖ ఓటీటీ ప్లేట్ ఫార్మ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ప్రియమణి నటించిన భామా కలాపం2.
ఈ సినిమాలో అన్నీ డబుల్‌గా ఉంటాయని అన్నారు ప్రియమణి. థ్రిల్స్, ట్విస్టులు ప్రేక్షకులను మెప్పిస్తాయని చెప్పారు ప్రియమణి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి