తెలుగులో ప్రేమలు మూవీ.. హీరోయిన్‌గా సారా అర్జున్..
29 Febraury 2024
ఇటీవల కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వరుస బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త నటీనటులతో చేస్తున్న ప్రయోగాలు ఘన విజయం సాధిస్తున్నాయి.
ఈ లిస్ట్‌లో సంచలన విజయం సాధించిన ప్రేమలు మూవీ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు మేకర్స్.
ఫాహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకుడు. మార్చి 8న తెలుగు వర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
డాన్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. త్రీక్వెల్‌లో రణవీర్ సింగ్ డాన్ పాత్రలో నటిస్తున్నారు.
కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమాను 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
డాన్ సిరీస్‌తో పాటు, రణవీర్ సింగ్ కెరీర్‌లో కూడా ఇదే భారీ బడ్జెట్ చిత్రం అంటున్నారు ఈ మూవీ మేకర్స్.
విక్రమ్ హీరోగా తెరకెక్కిన దైవ తిరుమగళ్ సినిమాలో బాల నటిగా కనిపించిన సారా అర్జున్, ఇటీవల పొన్నియిన్ సెల్వన్ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.
తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో సారాకు జోడిగా నటించిన సంతోష్ కూడా అదే మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.