14 May 2025

ఆఫర్స్ లేవు.. అయినా రెమ్యునరేషన్ పెంచేసిన యంగ్ హీరోయిన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

మలయాళీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా వరుస సినిమాలతో అలరిస్తుంది. కానీ ఇటీవల ఒక్క సినిమాతోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది.

తనే హీరోయిన్ మమిత బైజు. ఇటీవల ప్రేమలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతోనే ఇటు తెలుగులోనూ మరింత ఫేమస్ అయ్యింది. 

ఇటీవలే సింగిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు ఆమె తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. 

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మమితా బైజు రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్. తెలుగులోనూ మంచి క్రేజ్ రావడమే కారణమని టాక్. 

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న డ్యూడ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే దళపతి విజయ్ నటిస్తున్న మరో మూవీలో కీలకపాత్రలో కనిపించనుంది. 

అయితే ఇప్పుడు ఈ అమ్మడు పారితోషికం పెంచినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇదివరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే పారితోషికం తీసుకుందట మమితా.

కానీ ఇప్పుడు డ్యూడ్ సినిమా కోసం రూ.70 లక్షలకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుంట. ఇక జననాయగణ్ సినిమాకు ఏకంగా కోటి తీసుకుంటుందని టాక్.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు హిట్ అయితే తెలుగుతోపాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ. దీంతో పారితోషికం మరింత పెంచిన ఆశ్చర్యపోనవసరం లేదు.