ప్రేమలు హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచేసిందా ?.. ఒక్క సినిమాకు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
మలయాళంలో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది మమితా బైజు.
2017లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన మమితా.. కోకో, సూపర్ శరణ్య వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా క్రష్ అయ్యింది.
ఇటీవల ఆమె నటించిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అటు మలయాళం.. ఇటు తెలుగులో అనుహ్య విజయాన్ని అందుకుంది.
దీంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. ప్రేమలు సినిమాతో యూత్ కలల రాణిగా..ఆరాధ్య దేవిగా మారిపోయింది. జక్కన్న సైతం ఆమె నటనకు ఫిదా అయ్యాడు.
ఇక ఇప్పుడు ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. జీవీ ప్రకాష్ సరసన నటించనుందట.
అలాగే విష్ణు విశాల్ సరసన మరో ఛాన్స్ దక్కించుకుందని టాక్. అటు తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయని టాక్. దీంతో రెమ్యునరేషన్ డబుల్ చేసిందట.
ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 30 లక్షలు పారితోషికం తీసుకుందట మమితా.. ఇక ఇప్పుడు ప్రేమలు ఎఫెక్ట్ తో ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలు తీసుకుంటుందట.
అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు క్లారిటీ మాత్రం రాలేదు. కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ మాత్రమే. కానీ ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి.