క్రేజీ న్యూస్.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో మమిత బైజు 

Rajeev 

09 May 2024

ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో మమిత బైజు ఒకరు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్. 

మలయాళంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. మలయాళంలో తెరకెక్కిన ప్రేమలు సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. 

ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.అలాగే ఈ సినిమాలో నటించిన మమిత కు మంచి ప్రశంసలు దక్కాయి. 

దాంతో ఈ చిన్నది చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ భామ కూడా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలు వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా మమిత ఓ క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో మమిత ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. 

ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.. ఎస్.. విజయ్ దేవరకొండ సినిమాలో మమిత హీరోయిన్ గా చేస్తుందని తెలుస్తోంది.