రకరకాల డ్రెస్సులు ధరించి, అమెరికన్ యాక్సెంట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది ప్రీతి పగడాల. ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉంది.
నెట్టింట ఫేమస్ అయిన ప్రీతి ఇప్పుడు హీరోయిన్గా మారింది. పతంగ్ అనే సినిమాతో కథానాయికగా టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంది ప్రీతి.
ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ప్రీతి..ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తల్లిదండ్రులు పెట్టిన కండీషన్స్ గురించి చెప్పుకొచ్చింది.
అవకాశం వస్తే ఇంటిమేట్ సీన్లతోపాటు లిప్ లాక్ వంటి వాటికి ఓకే చెప్తావా అని యాంకర్ అడగ్గా.. నో అంటూనే అసలు విషయాన్ని బయటపెట్టింది ప్రీతి.
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు తన తండ్రి ఓ కండీషన్ పెట్టారని తెలిపింది. సినిమాలు ఓకే కానీ.. లిప్ లాక్ సీన్లు చేయ్యొద్దు అని అన్నారని చెప్పుకొచ్చింది ప్రీతి.
చిన్నప్పటి నుంచి తాను అడిగిన ప్రతిదానికి తన తల్లిదండ్రులు ఒప్పుకున్నారని.. అందుకే తండ్రి అడిగిన ఒక్క కండీషన్ దాటకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఇంటిమేట్ సీన్స్ చేస్తారా అని ఆఫర్స్ వచ్చాయని.. కానీ అందుకు ఒప్పుకోలేదని.. పరిమితి మేరకు ఇంటిమేట్ సీన్స్ ఉంటే చేస్తానని చెప్పుకొచ్చింది.
గ్లామర్ గా కనిపించడంలో ఎలాంటి కండీషన్స్ లేవని.. ఎందుకంటే ఈరోజుల్లో షార్ట్‌గా ఉన్న డ్రెస్సులు వేయడం సాధారణంగా మారిపోయిందని తెలిపింది ప్రీతి.