ప్రతినిధి 2 మాస్‌ నెంబర్‌..

TV9 Telugu

18 April 2024

నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న సినిమా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ప్రతినిధి 2. మూర్తి దేవగుప్తపు దర్శకుడు.

2014లో ప్రశాంత్ మండవ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధికి సీక్వెల్ గా వస్తున్న చిత్రమిది.

వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజ బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు.

ఈ నెల 25న విడుదల కానుంది ఈ మూవీ. విడుదల దగ్గర పడటంతో ప్రొమోషన్స్ లో బిజీ అయింది ప్రతినిధి 2 చిత్రబృందం.

తాజాగా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి 'గల్లా ఎత్తి..' అనే మాస్‌ నెంబర్‌ని విడుదల చేశారు మేకర్స్.

మహతి స్వరసాగర్‌ స్వరపరచిన పాట ఇది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల ఆలపించారు.

పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ప్రతినిధి2 సినిమాలో నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌గా నటించారు నారా రోహిత్‌.

ఈ చిత్రంపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. త్వరలో ట్రైలర్ కూడా రానుంది.