12-02-2024

హనుమాన్‌ నెగెటివ్ ప్రచారం పై దిమ్మతిరిగే రిప్లై

TV9 Telugu

సంక్రాంతి పండక్కి విడుదలైన హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది.

ఆంజనేయుడి పాత్రను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు.

ఓ రేంజ్ రెస్పాన్స్‏తో దూసుకుపోతున్న ఈ సినిమాపై పాజిటివ్ తోపాటు నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ కు, నిర్మాతకు మధ్య రెమ్యునరేషన్ కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని రూమర్స్ వైరలయ్యాయి.

అయితే నెగిటివ్ రివ్యూ్స్ కు ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు ప్రశాంత్ వర్మ.

తాను, నిర్మాత ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్ లో ఏదో చూస్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇలా నెగిటివిటీని తీసిపడేస్తూ నవ్వుకుంటున్నాం.

హనుమాన్ స్పిరిట్ ను కొనసాగిస్తున్నామంటూ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు. దీంతో దర్శకనిర్మాతల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు.