హనుమాన్ OTTపై నోరువిప్పిన డైరెక్టర్..
TV9 Telugu
13 March 2024
ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హనుమాన్’. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా అని నిరీక్షిస్తున్నారు.
సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. ఇటీవలే 50 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్.
థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమాను ఏ ఓటీటీలో రిలీజ్ చేస్తారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక అంతకు ముందు మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో హనుమాన్ మూవీ.. స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం నడిచింది.
కానీ మరోసారి ఓటీటీ మూవీ లవర్స్ కు నిరాశే ఎదురయ్యింది. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు నెటిజన్స్.
దీంతో రంగంలోకి దిగిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను త్వరలో అనౌన్స్ చేస్తామంటూ ట్వీట్ చేశారు.
ఇక ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలానే చెబుతూ పోండి.. మాకు ఇంట్రెస్ట్ పోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి