సలార్ ట్రైలర్‌ పై బిగ్ అప్డేట్..

08 October 2023

డైనోసార్ రాక కన్ఫార్మ్ అయిపోయింది.డిసెంబర్ 22 న థియేటర్లు షేక్‌ అవ్వడం పక్కా అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. అదోకే కానీ.. డైనోసార్ ఇంకెలా ఉండబోతోంది.

యాక్షన్ ఇంకేరేంజ్‌లో ఉండబోతోంది. అసలు సలార్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అనే ఆరాతీత ఫ్యాన్స్‌లో ఎక్కువైంది.

అయితే వారికోసమే అన్నట్టు.. ఇండస్ట్రీ నుంచి ఓ దిమ్మతిరిగే న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పుడా న్యూసే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ అయ్యేలా చేస్తోంది.

ఎస్ ! ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.

ఇప్పటికే టీజర్‌తో.. ఈ సినిమాలోని హీరోకు డైనోసార్ ఇమేజ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కట్ పై ఫోకస్ పెట్టారట.

తనకున్న ప్రైమరీ పనులను పక్కుకు పెట్టి మీర.. ఎట్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్.. ఈ మూవీ ట్రైలర్ కట్ మీదే కూర్చున్నారట.

ఈ సినిమాపై అందర్లో పెరిగిన హై ఎక్స్ పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యే విధంగా.. ఈ ట్రైలర్‌ను చేపిస్తున్నారట ప్రశాంత్ నీల్.

ఇక ఇదే టాక్.. ఇండస్ట్రీ నుంచి లీకై.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సలార్ ట్రైలర్ తొందర్లో రాబోతుందనే హింట్‌ను డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇచ్చింది. వారిని తెగ ఖుషీ అయ్యేలా చేసింది.