28 october 2023

ఒక్క ట్వీట్‌తో..  ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించిన డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్

ప్రభాస్‌ హీరోగా.. ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.

కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లాంగ్ గ్యాబ్‌ తర్వాత రిలీజ్‌కు రెడీ అయింది.

ముందుగా చెప్పినట్టు కాకుండా... డిసెంబర్ 22లో వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో విపరీతమైన వెయింటింగ్

దానికితోడు అప్డేట్స్‌ అంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్‌ మేకర్స్ పై విపరీతమైన ఓత్తిడి తీసుకొచ్చారు

ప్రభాస్‌ బర్త్‌ డే రోజు.. ట్రైలర్‌ కన్ఫార్మ్‌ అని బలంగా ఫిక్స్ అయి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

కానీ డార్లింగ్ బర్త్‌ డే రోజు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. డైరెక్టర్‌ తీరుపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.

ప్రశాంత్ నీల్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. దీంతో తాజాగా నీల్ వీరికోసం ఓ ట్వీట్ చేశారు

సలార్ టీజర్, ట్రైలర్తో పాటు.. ఓ సాంగ్ కూడా రెడీ అయిందని.. కానీ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలని ట్వీట్ చేశారు

ఇక ఈ ట్వీట్ చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ మరింతగా రెబలింగ్ అవ్వడం షురూ చేశారు.