ఇది... అంజనాద్రి 2.0: ప్రశాంత్..

TV9 Telugu

02 April 2024

వెల్కమ్‌ టు అంజనాద్రి 2.0 అంటున్నారు హనుమాన్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న డైరక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.

హనుమాన్‌ సీక్వెల్‌ జై హనుమాన్‌కి సంబంధించి గ్లింప్స్ షేర్‌ చేశారు టాలీవుడ్ క్రేజీ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మ షేర్ చేసిన ఈ గ్లింప్స్ రఘునందన పాటతో నెట్టింట వైరల్‌ అవుతోంది.

శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానంగా జై హనుమాన్‌ ఉంటుందని చెప్పారు మేకర్స్.

2025లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని హనుమాన్ మూవీ క్లైమాక్ లోనే రెవీల్ చేసారు మూవీ మేకర్స్.

ఈ సినిమాలో హీరో హనుమంతుడిని, ఈ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తారని హనుమాన్ సక్సెస్ పలుమార్లు చెప్పారు మేకర్స్.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇందలో హనుమంతుడిగా రానా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని, ఇందులో 12 సినిమాలు ఉన్నాయని, దీని ద్వారా కొత్త దర్శకులకు పరిచయం చేస్తానన్నారు ప్రశాంత్.