'హను-మాన్‌' దర్శకుడు కొత్త సినిమా.. హీరో ఎవరంటే..

TV9 Telugu

23 January 2024

తాజాగా సంక్రాంతికి వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'హను-మాన్‌'కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌' రానున్న సంగతి తెలిసిందే.

సీక్వెల్‌లో తేజ హీరో కాదని 'జై హనుమాన్' ప్రాజెక్ట్‌ను ఉద్దేశించి ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అన్నారు.

హను-మాన్‌’ సినిమా కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ చిత్రం ఉండనుందని తెలిపారు ప్రశాంత్ వర్మ.

సీక్వెల్‌లోనూ తేజ సజ్జా హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు.

2025లో ఇది విడుదల కానుంది. టీమ్‌ సహకారంతోనే తాను ఈ విజయాన్ని అందుకోగలిగానన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

రూ.45 కోట్ల బడ్జెట్‌తో ‘హను-మాన్‌’ తెరకెక్కింది. విడుదలైన పది రోజులు అవుతున్న ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లుతో దూసుకుపోతుంది.

ఈ చిత్రంలో కథానాయకిగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సజ్జ అక్కగా కీలక పాత్ర పోషించింది.

సముద్రఖని విభీషణుడి పాత్రలో మెప్పించారు. వినయ్ రాయ్ విలన్ గా ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను వంటి ఎవరు నటించారు.