చీరలో చందమామలా మెరిసిపోతున్న ప్రగ్య.. 

Prudvi Battula 

Credit: Instagram

07 February 2025

12 జనవరి 1987న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‎ అనే ఊరిలో పుట్టి పెరిగింది వయ్యారి భామ ప్రగ్యా జైస్వాల్.

మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సింబయాసిస్ లా స్కూల్ లో తన విద్యను పూర్తి చేసింది అందాల తార ప్రగ్యా జైస్వాల్.

సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న రోజుల్లో వివిధ అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా రాణించింది.

2014లో కళ, సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి సింబయాసిస్ వారిచే సాంస్కృతిక పురస్కారం అందుకుంది.

2014లో విడుదలైన విరాట్టు అనే తమిళ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అందాల భామ. తర్వాత టిటూ MBA అనే హిందీ మూవీలో కనిపించింది.

2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది ముద్దుగుమ్మ ప్రగ్య జైస్వాల్.

తర్వాత వరుణ్ తేజ్ కి జోడిగా కంచె అనే చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ చిత్రంలో నటనకి ఐదు అవార్డులు అందుకుంది.

చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది. అందమైన ఈ అమ్మడి అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.