ఈ అమ్మడి అందానికి దాసోహం కానీ అందం ఉందా ఈ లోకనా..

TV9 Telugu

22 March 2024

12 జనవరి 1991న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా తీరా ప్రాంతం జబల్‌పూర్ లో జన్మించింది అందాల తార ప్రగ్య జైస్వాల్.

మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణె నగరంలో సింబయాసిస్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో వివిధ అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా మారింది.

2014లో కళ, సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి సహజీవన సాంస్కృతిక పురస్కారాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

2014లో విడుదలైన విరాట్టు అనే తమిళ చిత్రంలో చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత టిటూ MBA అనే హిందీ సినిమా చేసింది.

2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే రొమాంటిక్ డ్రామా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.

అదే ఏడాది వరుణ్ తేజ్ సరసన కంచె చిత్రంలో హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో ఆమె నటనకి ఐదు అవార్డులు వరించాయి.

తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. 2021లో బాలయ్యకి జోడిగా నటించిన అఖండతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది.