అందాలతో గత్తరలేపుతున్న ప్రగ్యా పాప.. చూపులతో కిక్కేస్తుందిగా.. 

05 June 2026

Pic credit - Instagram

Phani Ch

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.

ప్రగ్యా పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది.

కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  

 తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది.

హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో కంచె తర్వాత చేసిన ‘నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

గత ఏడాది వచ్చిన ‘డాకు మహారాజు’ సినిమాలోనూ, అలాగే రీసెంట్‌గా వచ్చిన ‘అఖండ-2’లోనూ బాలయ్య సరసన నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

ఈ మూవీల మంచి విజయం సాధించినప్పటికీ ప్రగ్యాకు టాలీవుడ్‌లో కొత్త ఆఫర్లు పెద్దగా రాలేదు. ప్రస్తుతం చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో తన పూర్తి ఫోకస్‌ సోషల్ మీడియాపై పెట్టింది.