13 September 2023

వైట్ టాప్‌లో సెగలు రేపుతున్న 'కంచె' బ్యూటీ.. 

Pic credit - Instagram

వరుణ్ తేజ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'కంచె'. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. 

తెలుగులో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ రేట్ సాధించలేకపోయింది. 

తెలుగులో పలు యువ హీరోలు.. అలాగే సీనియర్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. బాలకృష్ణతో నటించిన 'అఖండ'తో సూపర్ హిట్ అందుకుంది. 

ఇక అందాల ఆరబోతకు వెనుకడుగు వేయని ప్రగ్యా జైస్వాల్.. పలు చిత్రాలతో తన అందచందాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడమే కాదు.. వెండితెరపై సెగలు పుట్టించింది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీలో సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతీ ఫోటో.. క్షణాల్లో తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

తన వెకేషన్ ఫోటోలతో పాటు.. లేటెస్ట్ ఫోటో షూట్స్‌కు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్. ఇక ఆ ఫోటోలను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తుంటారు.  

స్కై బ్లూ కలర్ ప్యాంట్, వైట్ టాప్ వేసుకుని ప్రగ్యా జైస్వాల్ దిగిన లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. వాటిని తమ మొబైళ్ల వాల్‌పేపర్లుగా భద్రపరుచుకుంటారు ఫ్యాన్స్.