స్టార్ యాంకర్ ప్లేస్ ను పక్కకి నెట్టేసిన సుడిగాలి సుధీర్

TV9 Telugu

04 April 2024

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై రాణిస్తున్నాడు. 

ఇక అసలు విషయానికొస్తే మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ స్థానం ప్రదీప్ మాచిరాజుదే. ఏళ్ల తరబడి ఆయన హవా సాగింది.

ఆయన యాంకర్ గా చేసిన గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, ఢీ డాన్స్ రియాలిటీ షో భారీ సక్సెస్ సాధించాయి. 

అయితే తాజాగా  హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్టార్స్ గా ఎదిగాక ప్రదీప్ హవా తగ్గుతూ వచ్చిందనే చెప్పాలి..

ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో తెలుగు పాప్యులర్ నాన్ ఫిక్షనల్ పెర్సనాలిటీస్ లో టాప్ 5లో ప్రదీప్ కి స్థానం దక్కలేదు.

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ టాప్ 3లో ఉన్నారు. రష్మీ, చమ్మక్ చంద్రకు తర్వాత స్థానాలు దక్కాయి.

తాజాగా ప్రదీప్ కి ఝలక్ ఇస్తూ  ఆహా లో ప్రసారమయ్యే  సర్కార్ గేమ్ షో సీజన్ 4 షోకి యాంకర్ గా సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్ స్థానంలో సుడిగాలి సుధీర్ ని తీసుకున్నారు.