ప్రేమికుడు రీ రిలీజ్ హక్కులు.. 

TV9 Telugu

20 March 2024

కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా, నగ్మా జంటగా శంకర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ప్రేమికుడు.

1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

3 కోట్లతో బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్లకు పైగా భారీ వసూలు చేసింది.

రఘువరన్, వడివేలు, గిరీష్ కర్నాడ్, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అల్లు రామలింగయ్య ఇందులో ముఖ్య పాత్రధారులు.

ఈ చిత్రంలో పాటలతో సంగీత ప్రియులు మనసు దోచారు ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్. ఇప్పటికి ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

కె.టి.కుంజుమన్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు సినిమాకి నిర్మాత. ఏ. ఎమ్. రత్నం సమర్పణలో శ్రీ సూర్య మూవీస్ సంస్థ నిర్మించింది.

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నందున ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

CLN మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మురళీధర్ రెడ్డి, రమణ ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు.