TV9 Telugu
25 February 2024
ప్రభాస్ కల్కి 2898 AD రూమర్స్ కు చెక్.! క్లారిటీ ఇచ్చిన యూనిట్.
వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా ‘కల్కి 2898 AD’.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఈ మూవీ పై ఇండస్ట్రీ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారీ తారాగణం.. అంతకుమించిన భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుండడంతో రోజు రోజుకీ ఈ మూవీపై హైప్ పెరిగిపోతుంది.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ 2024 మే 9న రిలీజ్ అవ్వనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా ఈ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. జస్ట్ ది వార్మ్ అప్ అనే క్యాప్షన్ తో ప్రభాస్ వీడియోను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా..
ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ విభిన్నంగా చేస్తుంది మూవీటీం.
దీంతో కల్కి 2898 వాయిదా పడనున్న రూమర్స్ కు చెక్ పడింది.దీంతో ఇప్పుడు కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి