TV9 Telugu
డార్లింగ్ మొదలుపెట్టేది అప్పుడే!
03 March 2024
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా గురించి పూటకో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆల్రెడీ మార్చి నెల నడుస్తోంది కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ స్పీడ్ పెంచింది ప్రాజెక్ట్ కే టీమ్.
ఓ వైపు ఎడిటింగ్, మరోవైపు గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా త్వరలోనే డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేస్తారట.
కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేసేద్దామని టైమ్ ఇచ్చేశారట ప్రభాస్. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ కథానాయిక. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు.
ఇదిలా ఉంటె మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ చిత్ర తర్వాతి షెడ్యూల్ మార్చ్ మొదటి వారంలో మొదలు కానుంది.
ఈ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమాను సంక్రాంతి 2025కి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి