పీరియాడిక్‌ డ్రామాలో డార్లింగ్..

TV9 Telugu

10 April 2024

ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మరో మూవీని కూడా లైన్‌లో పెడుతున్నారు.

తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డార్లింగ్‌.

ఈ సినిమాను రజకార్ల నేపథ్యంలో రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. మృణాల్ ఠాకూర్ కథానాయకిగా నటిస్తున్నారని టాక్.

ఈ మూవీకి సంబంధించి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీత సారథ్యంలో ఇప్పటికే మూడు పాటలు రికార్డింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రెబెల్ స్టార్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఏడీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం మే9న విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల సమాచారం.

ఈ సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీ రాజాసాబ్ చిత్రం చిత్రీకరణలో కూడా పాల్గునంటున్నారు.

దీని తర్వాత సలార్ పార్ట్ 2, స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఆ తర్వాత హను రాఘవపూడి మూవీ తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది.