హ్యాష్‌ట్యాగ్‌లో అదరగొట్టావ్ డార్లింగ్!
TV9 Telugu
16 March 2024
సోషల్ మీడియా వేదిక వచ్చిన తర్వాత ప్రతిదీ ట్రెండ్ అవుతుంది. ప్రతి సందర్భంలోనూ ట్రెండింగ్‌లో ఉండాల్సిందే.
అలా ట్రెండ్ అయిన సినిమాలను, హీరోలను, హ్యాష్ ట్యాగులను గురించి ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ సర్వే చేసింది.
టాప్ హ్యాష్‌ట్యాగ్స్ ఇన్ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ప్రభాస్ పేరే మళ్లీ రిఫ్లెక్ట్ అయింది.
ఇందులో టాప్ టెన్‌లో ఏడో ప్లేస్‌లో ఉంది ప్రభాస్ హ్యాష్‌ట్యాగ్. ప్రభాస్ మినహా మరే స్టార్‌కీ ఈ లిస్టులో చోటు దక్కలేదు.
సినిమాల పరంగా కోలీవుడ్ నుంచి లియో, నార్త్ నుంచి భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ షారుఖ్ జవాన్, పఠాన్ ఉన్నాయి.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, ఆదిపురుష్ హ్యాష్‌ట్యాగ్ మాత్రం భీభత్సంగా ట్రెండ్ అయింది.
తమ హీరో మీద అభిమానాన్ని చాటుకోవడానికి ఇంతకన్నా అవకాశం ఇంకేం కావాలంటూ మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇప్పటిదాకా ఈ రకమైన కాంపిటిషన్ స్టార్స్ మధ్య కనిపించలేదు. ఇక నుంచి ఈ తరహా హ్యాష్‌ట్యాగ్స్ పోటీ కూడా మొదలుకానున్నదన్నమాట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి