ప్రభాస్ vs మహేష్.. ఒకే టైంకి రెండు సినిమాలు..
07 September 2023
అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఓ వార్త ఇటు ప్రభాస్ అండ్ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది.
ఇంతకీ అంతలా ఏమైందని అనుకుంటున్నారా? ఓకే టైంకి సలార్, గుంటూరు కారం రెండు సినిమాల రిలీజులు కన్ఫర్మ్ అయ్యాయట మరి.
ఎస్ ! షూటింగ్ బిగినింగ్ నుంచి.. 2024 సంక్రాంతి డేట్ మీద కన్నేసిన మహేష్.. ఆ డేట్ రోజు సోలోగా వచ్చి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టాలనుకున్నారు.
కలెక్షన్లను కుమ్మేద్దామనుకున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలయ్యారు. ఈ సంక్రాంతి బాబుదే అంటూ.. తెగ సంబరాలు చేసుకున్నారు.
కానీ కట్ చేస్తే.. సలార్ సంక్రాంతికి వస్తుందనే అన్ అఫీషియల్ .. అఫీషియల్ రూమర్‌తో.. సడెన్‌గా షాక్ లోకి జారుకున్నారు.
ప్రభాస్ తన సలార్ సినిమాతో.. మహేష్ కలెక్షన్లను ఎక్కడ చీల్చుతాడో అని గట్టిగానే ఫీలవుతున్నారు మహేష్ ఫాన్స్.
ఇక ప్రభాస్ ఏమో తన మోస్ట్ అవెటెడ్ సలార్ మూవీని ముందుగా సెప్టెంబర్ 28కి తీసుకొద్దామనే అనుకున్న సంగతి తెలిసిందే.
కానీ గ్రాఫిక్ వర్క్ పై డైరెక్టర్ అంతగా సాటిస్ ఫైగా లేకపోవడంతో.. రిలీజ్ డేట్ ను సంక్రాంతికి షిఫ్ట్ చేశారనే లీక్ ఇండస్ట్రీలో బజ్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి