కొన్ని కొన్ని కటౌట్ ను చూసి నమ్మేయాలి డ్యూడ్.. టాలీవుడ్.. బాలీవుడ్.. హాలీవుడ్.. అంతకుమించి.. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్.
ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. హిందీ, ఇంగ్లీస్, మలయాళం.. తమిళం.. ఇలా ప్రపంచానికే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు..
అయితే ఈ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తన సినిమా రంగంలోకి అడుగు పెట్టినదగ్గర నుండి ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొట్టమొదటిది శోభన్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్ చేసిన సినిమా వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ హీరోగా తొలి సక్సెస్ అందుకున్నాడు.
ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఛత్రపతి. ఈ సినిమా రెబల్ స్టార్ కెరీర్ ను ఒక కొత్త మలుపు తిప్పిందనే చెప్పాలి. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ మరింత దగ్గర అయ్యాడు.
ఆ తరువాత కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా డార్లింగ్. ఈ మూవీ తో రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త డార్లింగ్ ప్రభాస్ గా మారిపోయాడు.
దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా డిఫరెంట్ మూవీగా నిలిచిందనే చెప్పాలి.
ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించిన మరొక సినిమా మిర్చి. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాగ ప్రభాస్ తొలిసారి రూ. 40 కోట్ల క్లబ్బులో చేరాలా చేసింది.
రాజమౌళితో చేసిన బాహుబలి 1 సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తెలుగులో రూ. 100 కోట్ల షేర్ అందుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే.
తరువాత పార్ట్ బాహుబలి 2 తెలుగులోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ చేసింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన సినిమా సలార్ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ను అందించింది. ఈ సినిమాలో ప్రభాస్... కర్ణుడిగా.. భైరవుడిగా రెండు పాత్రల్లో మెప్పించాడు.