TV9 Telugu

04 February 2024

డార్లింగ్ ఫ్యాన్స్ కి షాక్.! సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న ప్రభాస్.?

‘సలార్‌’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్‌.

ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైనప్ చేసిన షూటింగ్‌ చేసుకుంటూ పోతున్న డార్లింగ్‌..

ఆల్ ఆఫ్ సడెన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారట. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘కల్కి 2898 AD’, ‘రాజా సాబ్’ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

ఆ తర్వాత ‘స్పిరిట్’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది.

ప్రభాస్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే కొద్ది రోజులు అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వనున్నారట ప్రభాస్.

ఇక ప్రభాస్‌ సర్జరీ కోసం యూరప్ వెళ్లనున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ని బ్యాక్ టు బ్యాక్ బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటే సినిమాల విడుదల ఆలస్యం కావడం పక్కా.. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.